HomeతెలంగాణOrgans Donation | అవయవదానంతో నలుగురికి ప్రాణం పోసిన యువ లాయర్

Organs Donation | అవయవదానంతో నలుగురికి ప్రాణం పోసిన యువ లాయర్

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Organs Donation : అవయవదానంతో నలుగురికి ప్రాణం పోశారు ఓ యువ లాయర్. కావలి శివ ప్రసాద్ కుటుంబ సభ్యులు గొప్ప మనుసు చాటారు. పుట్టెడు దుఃఖంలోనూ ఉదారత చాటుకున్నారు. తెలంగాణలోని మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం బుర్గుపల్లి (Burgupalli, Jadcharla mandal, Mahabubnagar district, Telangana)కి చెందిన కావలి శివ ప్రసాద్​(22) లాయర్​గా ప్రాక్టీస్ చేస్తున్నారు.

కాగా, జూన్ 17, 2025న ఆయన తలపై పదునైన ఆయుధం తగలడంతో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌(Hyderabad)లోని నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)కి తరలించారు. అత్యవసర చికిత్స తర్వాత జూన్ 27, 2025న మధ్యాహ్నం 3:59 గంటలకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు.

దీంతో శివ ప్రసాద్ తండ్రి కె.నర్సింలు తన తనయుడి అవయవాలు దానం చేయడానికి ముందుకొచ్చారు. రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులను దానం చేసి, నలుగురు రోగులకు సాయపడ్డారు.

ఇదే విషయాన్ని ఐపీఎస్​ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్​ ఎక్స్ X వేదికగా పోస్ట్​ చేశారు. పుట్టెడు దు:ఖంలో ఉదారత చాటుకున్న ఆ కుటుంబానికి సెల్యుట్​ చేశారు. ఆ కుటుంబ సభ్యులది గొప్ప మనస్సు అని పేర్కొన్నారు.