Homeక్రీడలుCricketer | సిక్స్ కొట్టి మైదానంలో కుప్పకూలిన యువ క్రికెటర్​.. వీడియో వైరల్

Cricketer | సిక్స్ కొట్టి మైదానంలో కుప్పకూలిన యువ క్రికెటర్​.. వీడియో వైరల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cricketer : గుండెపోటు(Heart attack) ఎవరికి ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. ఫిట్​నెస్​కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆటగాళ్లు కూడా హార్ట్ ఎటాక్​కు గురవుతున్నారు. ఇటీవల మేడ్చల్​(Medchal)లో ఓ యువకుడు హార్ట్ ఎటాక్​తో గ్రౌండ్​లోనే కుప్పకూలిపోయాడు. తాజాగా పంజాబ్​లోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.

పంజాబ్​(Punjab)లో క్రికెట్ ఆడుతూ యువ క్రికెటర్ హార్ట్ ఎటాక్​తో కుప్పకూలిపోయాడు. ఫిరోజ్ పూర్ జిల్లా(Ferozepur district)లో జరిగిన ఓ లోకల్ క్రికెట్ మ్యాచ్​లో ఈ విషాద ఘటన నెలకొంది. ఆ బ్యాటర్​ను ఫిరోజ్ పూర్​కు చెందిన హర్జీత్ సింగ్ గుర్తించారు.

Cricketer : బాల్​ను బౌండరీ దాటించి..

మైదానంలో హర్జీత్ సింగ్ Harjeet Singh బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలర్​ వేసిన బంతిని (సిక్స్) బౌండరీ దాటించి, పిచ్​లో ముందుకు నడుచుకుంటూ వెళ్లి పడిపోయాడు. అలసటతో కూలబడి అలానే కిందపడిపోయాడు. తోటి ఆటగాళ్లు అతనికి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది.

Cricketer : ఇటీవల బంగ్లా క్రికెటర్​..

యువ క్రికెట్​ గుండెపోటుతో మరణించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో క్రికెటర్లు హార్ట్ ఎటాక్​కు గురవుతున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన స్టార్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ Bangladeshi star batsman Tamim Iqbal కూడా ఇటీవల మైదానంలోనే కుప్పకూలిపోయాడు. సకాలంలో చికిత్స అందించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.