అక్షరటుడే, హైదరాబాద్: Cyberabad : సైబరాబాద్ పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. కొందరి ఆగడాలు ఆగడం లేదు. రీల్స్ కోసం పిచ్చి పనులు చేస్తున్నారు.
నడి రోడ్డుపైనే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మద్యం మత్తులో తూలుతున్నారు. చట్టాలపై అవగాహన లేకపోవడమో.. లేక మమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరనే అహంకారమో.. తెలియదు కానీ, అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు.
తాజాగా ఓ జంట బైక్‌పై అసభ్యకరంగా స్టంట్ చేసింది. హైదరాబాద్(Hyderabad)లోని ఆరామ్‌ఘర్ ఫ్లైఓవర్ (Aramgarh flyover) పై ఈ ఘటన జరిగింది. ఒక యువకుడు తన స్నేహితురాలిని ద్విచక్ర వాహనంపై తన ముందు కూర్చోబెట్టుకుని దూసుకెళ్లాడు. వీడియో తీస్తున్నప్పుడు అసభ్యంగా ప్రవర్తించాడు.
Cyberabad | వారించినా..
ఇతర బైకర్లు, వాహనదారులు వారిని ఆపే ప్రయత్నం చేసినా.. పట్టించుకోలేదు.. సరికదా మరింత రెచ్చిపోయి వేగంగా దూసుకెళ్లారు. ఈ ఘటనను ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Cyberabad | కఠిన చర్యలకు డిమాండ్
ఇన్‌స్టా రీల్స్ కోసం హైదరాబాద్ జంట చేసిన ఈ ప్రమాదకర స్టంట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. వీరి అసభ్యకరమైన, ప్రమాదకరమైన చర్యపై సైబరాబాద్ పోలీసులు (Cyberabad police) కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Cyberabad | పర్యవేక్షణ కొరవడి..
తల్లిదండ్రుల (Perents) పర్యవేక్షణ, నియంత్రణ లేకపోవడం వల్లనే పిల్లలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. దీనికితోడు పోలీసులు కఠినంగా వ్యవహరించడమూ ముఖ్యమే. వివిధ పనుల నిమిత్తం హడావుడిగా బైక్ (Bike) లపై వెళ్లే సామాన్యులపై కాకుండా, ఇలా రెచ్చిపోయి ప్రవర్తించే వారిపై కఠినంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Cyberabad | అవగాహన సదస్సులు..
చట్టాల (ACTs) పై అందరికీ అవగాహన కల్పించేందుకు తరచూ సదస్సులు నిర్వహించాలని కోరుతున్నారు. కళాశాలలు (Colleges), ప్రైవేటు కార్యాలయాల్లో (private offices) ఇలా అవగాహన సదస్సులు (awareness seminars) నిర్వహించడం ద్వారా కొంతైనా ఇలాంటి ఘటనలను నివారించ వచ్చని పేర్కొంటున్నారు.