HomeతెలంగాణBathukamma Young Filmmakers’ Challenge | యువ కంటెంట్ క్రియేటర్లకు ప‌ట్టం.. బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్...

Bathukamma Young Filmmakers’ Challenge | యువ కంటెంట్ క్రియేటర్లకు ప‌ట్టం.. బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ – 2025 పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలు!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Bathukamma Young Filmmakers’ Challenge | తెలంగాణ‌లోని యువ కంటెంట్ క్రియేటర్లకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (Telangana Film Development Corporation – TGFDC) ప‌ట్టం క‌ట్టబోతోంది.

‘బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ – 2025’ (Bathukamma Young Filmmakers’ Challenge – 2025) పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వ‌హిస్తోంది.

3 నిమిషాలు, 5 నిమిషాల లోపు నిడివి కలిగిన రెండు కేటగిరీల్లో షార్ట్ ఫిలిమ్స్, పాటలు పంపించాలని ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు FDC Chairman Dil Raju కోరారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి Chief Minister .Revanth Reddy ఆధ్వ‌ర్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు (మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు, మ‌హాల‌క్ష్మి, గృహ‌జ్యోతి, ఇందిర‌మ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ త‌దిత‌రాలు), తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతి, పండుగ‌లు, క‌ళారూపాల‌పై షార్ట్ ఫిలిమ్స్‌, పాట‌లను పోటీ కోసం పంపించాలి.

Bathukamma Young Filmmakers’ Challenge | చివరి తేదీ సెప్టెంబరు 30

సెప్టెంబరు 30 లోపు ఎంట్రీలను పంపించాల్సి ఉంటుందని, నిర్దేశిత గడువులోగా అందిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి ఎంపిక చేస్తారని దిల్ రాజు తెలిపారు.

ఈ పోటీల్లో పాల్గొనే వారికి భవిష్యత్తులోనూ అనేక రకాలుగా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను దిల్ రాజు విడుదల చేశారు.

ఎంట్రీల‌ను ఈ కింది మెయిల్ ID: youngfilmmakerschallenge@gmail.com లేదా వాట్సప్ నంబరు – 8125834009 (WhatsApp Only) కు పంపించాల్సి ఉంటుంది.

పోటీలో ఎంపికైన షార్ట్ ఫిలిమ్స్‌కు ప్రథమ బహుమతి రూ. 3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. 2 లక్షలు, తృతీయ బహుమతి రూ. 1 లక్ష చొప్పున అందిస్తారు.

మరో ఐదుగురికి రూ. 20 వేల చొప్పున కన్సొలేషన్ బహుమతులు అందజేస్తారు. విజేతలకు నగదుతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను ప్రదానం చేస్తారు.

Bathukamma Young Filmmakers’ Challenge | పోటీలో పాల్గొనడానికి అర్హతలు:

  • ఈ పోటీలో పాల్గొనే వారి వయసు 40 ఏళ్ళ లోపు ఉండాలి.
  • కంటెంట్ 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి.
  • షార్ట్ ఫిల్మ్స్ / వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీలలో సూచించిన ‘థీమ్’ ల పైనే ఉండాలి.
  • మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు.
  • బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ కోసం మాత్రమే చిత్రీకరించినవై ఉండాలి.
Must Read
Related News