HomeతెలంగాణTraffic challan | పోలీస్​ వాహనాలపై ఫైన్​ ఎంతో తెలిస్తే షాక్​ అవుతారు!

Traffic challan | పోలీస్​ వాహనాలపై ఫైన్​ ఎంతో తెలిస్తే షాక్​ అవుతారు!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Traffic challan | ట్రాఫిక్​ నిబంధనలు traffic rules పాటించని వాహనదారులకు పోలీసులు ఫైన్లు వేస్తారు. ఫైన్లు కట్టకపోతే వాహనాలు సీజ్​ చేశారు. మరీ పోలీసులే ట్రాఫిక్​ నిబంధనలు పాటించకపోతే ఎలా.. ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే తమ వాహనాలకు సంబంధించిన పెండింగ్​ చలాన్లు కట్టకపోతే ప్రజలు ఏమనుకుంటారు.

తెలంగాణ డీజీపీ DGP పేరిట నమోదైన పోలీసుల వాహనాలపై ఉన్న పెండింగ్​ చలాన్లు తెలిస్తే షాక్​ అవ్వడం ఖాయం. మొత్తం రూ.68,67,885 చలాన్లు కట్టాల్సి ఉంది. ఈ వివరాలు ఆర్టీఐ rti ద్వారా అడిగిన ప్రశ్నకు పోలీస్​ శాఖ అధికారులే తెలిపారు. మొత్తం వాహనాలపై 17,391 చలాన్లకు సంబంధించి రూ.68.67 లక్షల ఫైన్లు ఉన్నాయి. సామాన్యులపై ఒక ఫైన్​ ఉన్నా వాహనాలు సీజ్​ చేసే అధికారులు తమ వెహికిల్స్​ చలాన్లు ఎందుకు కట్టడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.