ePaper
More
    HomeతెలంగాణTraffic Challan | ఆ బైక్​పై ఎన్ని ఫైన్లు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

    Traffic Challan | ఆ బైక్​పై ఎన్ని ఫైన్లు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Traffic Challan | ప్రభుత్వం వాహనదారుల భద్రత గురించి ట్రాఫిక్​ నిబంధనలు(Traffic regulations) అమలు చేస్తోంది. వాటిని ఉల్లంఘించిన వారికి పోలీసులు(Police) జరిమానాలు వేస్తుంటారు. ఫైన్లు వేస్తే ఆ భయంతోనైనా వాహనదారులు ట్రాఫిక్​ నిబంధనలు పాటిస్తారని భావన. కానీ కొందరు మాత్రం ట్రాఫిక్​ నిబంధనలు పాటించడం లేదు. అడ్డదారుల్లో పోలీసులకు చిక్కకుండా ఉండటానికి కొందరు యత్నిస్తుంటారు. మరికొందరేమో ఫైన్లు పడ్డా సరే మాకెంటిలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అలాంటి వ్యక్తి వాహనాన్ని పోలీసులు తాజాగా సీజ్(Siege)​ చేశారు.

    మాములుగా వాహనాలపై ఒకటి రెండు ఫైన్లు ఉంటేనే యజమానులు భయపడతారు. అలాంటింది ఏకంగా 109 చలాన్లు(109 challans) ఉన్నా.. సదరు వాహనదారుడు దర్జాగా రోడ్డుపై వెళ్తుండడం గమనార్హం. హన్మకొండలో ట్రాఫిక్ పోలీసుల(Hanmakonda Traffic police) తనిఖీల్లో భిక్షపతి అనే వాహనదారుడిని పోలీసులు ఆపారు. అతడి బైక్​పై ఉన్న ఫైన్లను చెక్​ చేసి చలాన్లు చూసి కుంగుతిన్నారు. వాహనం మొత్తం 109 చలాన్లు ఉండగా.. జరిమానా విలువ రూ.26,310 కావడం గమనార్హం. సిగ్నల్ జంపింగ్(Signal jumping), హెల్మెట్ లేని ప్రయాణం వంటి నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడి వాహనాన్ని సీజ్​ చేశారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...