అక్షరటుడే, ఇందూరు : RBI UDGAM | వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం అందుబాటులోకి తెచ్చిన ‘మీ డబ్బు మీ హక్కు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) సూచించారు. జిల్లా కలెక్టరేట్లో (District Collectorate) శనివారం ‘మీ డబ్బు..మీ హక్కు’ శిబిరాన్ని ప్రారంభించారు.
RBI UDGAM | కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు..
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తుల పరిష్కారం కోసం నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వరకు ‘డబ్బు.. మీ హక్కు’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమకు చెందాల్సిన అన్ క్లెయిమ్ బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెంట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా రాబడులు తదితర ఆర్థికపరమైన ఆస్తులను తిరిగి క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పిస్తుందన్నారు.
RBI UDGAM | ఆర్థికపరమైన ఆస్తులపై..
ఆర్థికపరమైన ఆస్తులపై హక్కు కలిగిన వారు ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదించి తమ నిధులను తిరిగి క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల్లో పదేళ్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలు ఆర్బీఐ ఉద్గం వెబ్సైట్లో చూసుకొని సులభంగా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఎల్డీవో రాములు (RBI LDO Ramulu), ఎస్ఎల్సీ మేనేజర్ ప్రకాష్, ఎస్బీఐ ఆర్ఎం మహేశ్వర్, ఏజీఎం రవికిరణ్, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.