అక్షరటుడే, బోధన్ : Bodhan Town | తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు (Teachers) గర్వపడేలా విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని ‘మేము సైతం స్వచ్ఛంద సంస్థ’ వ్యవస్థాపక అధ్యక్షుడు నవీన్ కుమార్ సూచించారు. బోధన్ పట్టణంలోని ఏరాజ్పల్లి (Erajpalli) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం తమ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు నిఘంటువులు అందజేశారు.
Bodhan Town | చదువుకున్న పాఠశాలకు పేరు తేవాలి..
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు (Students) కష్టపడి చదివి తాము చదువుకుంటున్న పాఠశాలకు పేరు తేవాలని సూచించారు. తమ సంస్థ ద్వారా 15 ఏళ్లుగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రేమలత, కాట్ర గడ్డ భారతి, ఉదయలక్ష్మి, శ్రీలక్ష్మి, సునీత, యామిని, చంద్రశేఖర్, సంస్థ సభ్యులు నితిన్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.