అక్షరటుడే, ఇందూరు: Ration Cards | జిల్లాలో రేషన్‌కార్డుల్లో మార్పులు, చేర్పులు, కొత్త వాటికోసం నేరుగా మీసేవ కేంద్రాల్లోనే సంప్రదించాలని.. దళారులను ఆశ్రయించవద్దని నిజామాబాద్ నార్త్ (Nizamabad Narth ), సౌత్ (Nizamabad South) తహశీల్దార్లు విజయ్‌కాంత్‌రావు, బాలరాజు పేర్కొన్నారు. గురువారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. రేషన్‌కార్డుల కోసం నేరుగా మీసేవల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్తరేషన్ కార్డులు, మార్పులు చేర్పులు అన్ని కూడా మీసేవ కేంద్రాల్లోనే (Meeseva Centers) జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన రుసుమునే మీసేవల్లో చెల్లించాలని సూచించారు. ఎక్కడ కూడా మధ్యవర్తులను, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు ఇంటికి వద్దకే వచ్చి విచారణ చేసి అర్హతను బట్టి ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తారని పేర్కొన్నారు.
