అక్షరటుడే, బాన్సువాడ : Banswada Municipality | ఓటర్ల జాబితా సవరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ (Municipal Commissioner) శ్రీహరి రాజు పేర్కొన్నారు. ఈ మేరకు బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో (Municipal Office) సోమవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు.
Banswada Municipality | బాన్సువాడ మున్సిపాలిటీలో..
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్ల జాబితాల పరిశీలన, కొత్తగా చేర్పులు, తొలగింపులు, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, సౌకర్యాలు వంటి అంశాలపై చర్చించారు. ఓటర్ల జాబితాలు తప్పులేకుండా పారదర్శకంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఓటరుకు ఓటుహక్కు కల్పించేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో (Polling Centers) అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.