అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aadhaar card | ఆధార్ కార్డులో అడ్రస్(Address) వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి ఇక ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చునే అప్‌డేట్ చేసుకోవచ్చు. అది కూడా పూర్తి ఉచితంగా.. అయితే ఈ అవకాశం ఈనెల 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఛార్జీలు వసూలు చేసే అవకాశాలున్నాయి. కాబట్టి అడ్రస్ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్న వారు ఈ అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకోండి. మరెందుకు ఆలస్యం.. ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా ఎలా అప్‌డేట్ చేసుకోవాలో తెలుసుకుందామా..
Aadhaar card | ఎలా అప్డేట్ చేసుకోవాలంటే..
- myAadhaar పోర్టల్‌లోకి వెళ్లాలి. లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా(Captcha) కోడ్ ఎంటర్ చేయాలి.
- రిజస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ(OTP) వస్తుంది. దానిని నమోదు చేయాలి.
- డ్యాష్‌బోర్డులో ఆధార్ సర్వీస్ ఆప్షన్ల నుంచి అడ్రస్ చేంజ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- వివరాలను సరి చూసుకొని నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి మార్చుకోవాల్సిన అడ్రస్‌కు సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్లను(ఉదాహరణకు, పాస్‌పోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి) నిర్ణీత సైజ్‌లో అప్‌లోడ్ చేయాలి. డాక్యుమెంట్ల సైజులు (సాధారణంగా 2MB లోపు), ఫార్మాట్ (PDF/JPEG) సరిచూసుకోండి. అనంతరం నమోదు చేసిన వివరాలను సరిచూసుకొని సబ్మిట్ చేస్తే యూఆర్‌ఎస్(URN) నంబర్ వస్తుంది. నిర్ణీత సమయం తర్వాత అడ్రస్ అప్‌డేట్ అవుతుంది.
Aadhaar card | స్టేటస్ చెక్ చేసుకోవచ్చిలా..
మై ఆధార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కింద చూపించే ఆప్షన్లలో చెక్ ఆధార్(Check aadhar) అప్‌డేట్ స్టేటస్ ఎంచుకోవాలి. అందులో యూఆర్‌ఎన్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అప్‌డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో తెలుస్తుంది.