Homeబిజినెస్​SBI Jan Nivesh | ‘జన్‌ నివేశ్‌’.. కోటీశ్వరులు అయ్యే స్కీం..

SBI Jan Nivesh | ‘జన్‌ నివేశ్‌’.. కోటీశ్వరులు అయ్యే స్కీం..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SBI Jan Nivesh : సాధారణంగా సిప్‌(SIP)లు రూ. 500 నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఇది అసంఘటిత రంగాలలో పనిచేస్తున్నవారికి, చిన్న మొత్తంలో మదుపు చేయాలనుకునేవారికి అనుకూలంగా లేకపోవడంతో చాలా మంది సిప్‌కు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరికీ పెట్టుబడి (Investment) మొత్తం అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ ఏడాది తొలినాళ్లలో ఎస్‌బీఐ(SBI) జన్‌ నివేశ్‌ సిప్‌ స్కీమ్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా కనీసం రూ.250తో మదుపు చేయొచ్చు.

SBI Jan Nivesh : తక్కువ రిస్క్‌తో.. ఎక్కువ లాభాలు..

స్టాక్‌ మార్కెట్‌(Stock market)లో మంచి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నా ఇందులో రిస్క్‌ ఎక్కువ. అవగాహన లేకుండా పెట్టుబడి పెడితే నష్టపోవడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మ్యూచ్‌వల్‌ ఫండ్‌(Mutual fund)లలో కొంత రిస్క్‌ తక్కువ. తక్కువ రిస్క్‌తో లాభాలు ఆర్జించాలనుకునే వారికి మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ క్రమానుగత పెట్టుబడి విధానం(Systematic Investment Plan) సౌలభ్యాన్ని తీసుకువచ్చాయి.

సాధారణంగా సిప్‌లు రూ.500 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో రోజువారీ(Daily)గా, వారం వారీగా, నెలవారీగా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే రూ. 500 ఇన్వెస్ట్‌ చేయడం చిన్న మదుపరులకు కష్టసాధ్యమని భావించిన ఎస్‌బీఐ మ్యూచ్‌వల్‌ ఫండ్‌.. జన నివేశ్‌ సిప్‌ స్కీం తీసుకువచ్చింది. దీని ప్రకారం కనీసం రూ. 250 నుంచి సిప్‌ చేయొచ్చు.

డీమాట్‌ అకౌంట్‌ తప్పనిసరి కాదు. ఎస్‌బీఐ యోనోతో sbi yono పాటు పేటీఎం, గ్రో(Groww), జెరోధా వంటి ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా కూడా ఈ పథకంలో సిప్‌ చేయవచ్చు. సాధారణంగా సిప్‌ చేసేందుకు ట్రాన్జాక్షన్‌ చార్జీలు విధిస్తారు. కానీ ఎస్‌బీఐ ఈ పథకానికి ట్రాన్జాక్షన్‌ చార్జీలను మినహాయించింది. సిప్‌ మొత్తాలను ఎస్‌బీఐ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌లో పెట్టుబడి పెడుతోంది. ఈ ఫండ్‌ ఇప్పటివరకు మంచి రాబడులను అందిస్తూ వస్తోంది.

SBI Jan Nivesh SIP : రోజుకు రూ. 250తో.. 30 ఏళ్లలో రూ. 2.6 కోట్లు..

మ్యూచ్‌వల్‌ ఫండ్లలో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టినవారికి సరాసరి 10 నుంచి 15 శాతం రాబడులు వస్తున్నాయి. ఎస్‌బీఐ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌(SBI Balanced Advantage Fund) ప్రారంభంనుంచి 12 శాతానికిపైగా రిటర్న్‌లు అందిస్తోంది. దీని ప్రకారం ఓ వ్యక్తి 30 ఏళ్ల కాలానికి సిప్‌ చేయాలని నిర్ణయించుకుని ఎస్‌బీఐ జన నివేశ్‌ సిప్‌ స్కీమ్‌లో చేరితే మూడు దశాబ్దాలలో అతడు కోటీశ్వరుడు అవడానికి అవకాశం ఉంటుంది.

అయితే, ఇందుకోసం రోజూ కనీసం రూ. 250 చొప్పున 30 ఏళ్లపాటు సిప్‌ చేయాల్సి ఉంటుంది. 30 ఏళ్లలో అతడి పెట్టుబడి రూ. 27 లక్షలు అవుతుంది. కనీసం 12 శాతం సీఏజీఆర్‌ చొప్పున రిటర్న్‌(Returns)లు వస్తాయనుకుంటే.. 30 ఏళ్లలో రూ. 23.37 కోట్లు రాబడి రావడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడితో కలుపుకుని రాబడి మొత్తం రూ. 2.64 కోట్లు అవుతుంది.

కాగా, రోజువారీగా సిప్‌ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ రోజైనా సిప్‌ అమౌంట్‌ను ఖాతాలో నిల్వ ఉంచకపోతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మంత్లీ సిప్‌(Monthly SIP) ఆప్షన్‌ను ఎంచుకోవడం ఉత్తమం.