ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Yogandhra Guinness Record | గిన్నిస్‌ బుక్‌ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం.. హైలైట్స్...

    Yogandhra Guinness Record | గిన్నిస్‌ బుక్‌ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం.. హైలైట్స్ వీడియో షేర్ చేసిన చంద్ర‌బాబు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yogandhra Guinness Record | యోగా డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్​లో ఏపీలో యోగాంధ్ర (AP yogandhra) పేరుతో ప్రత్యేక కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌గా మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. 3 లక్షలకుపైగా ప్రజలు పాల్గొన్న యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డుల్లో (Guinness Book of World Records) చోటు దక్కించుకుంది. ఇదే అంశంలో గతంలో ‘సూరత్ యోగా’ రికార్డును ‘విశాఖ యోగాంధ్ర’ (Visakha Yogaandhra) బద్దలు కొట్ట‌డం విశేషం. గతంలో సూరత్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో లక్షా 47 వేల మంది పాల్గొనగా, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికైన విశాఖలో 3 లక్షలకు పైగా ప్రజలు భాగస్వాములయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సమక్షంలో యోగాంధ్ర ఈ గిన్నిస్ రికార్డు సొంత‌మైంది.

    Yogandhra Guinness Record | ప‌లు రికార్డులు..

    విశాఖ ఆర్కే బీచ్‌ (RK Beach) నుంచి భోగాపురం వరకు లక్షల మంది ప్రజలు యోగాసనాలు వేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్​ (Minister Nara Lokesh) సహా పలువురు మంత్రులు పాల్గొని 45 నిమిషాలపాటు యోగాసనాలు వేశారు. గిరిజన విద్యార్థుల సూర్యనమస్కారాలకు మరో గిన్నిస్‌ రికార్డు వచ్చింది. అల్లూరి జిల్లాలో ఒకేసారి 22,122 మంది గిరిజన విద్యార్థులు సూర్యనమస్కారాలు చేశారు. ఈ మేరకు మంత్రులు లోకేశ్, సత్యకుమార్‌కు గిన్నిస్‌ రికార్డు ధ్రువపత్రాలు అందజేశారు.

    యోగాడే నిర్వహణ, గ్రాండ్ సక్సెస్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. ఈరోజు (శనివారం) విశాఖ కలెక్టర్ కార్యాలయంలో (Visakhapatnam Collectorate) మంత్రులు, అధికారులతో సీఎం రివ్యూ చేపట్టారు. సమావేశ మందిరంలోకి సీఎం చంద్రబాబుకు కరతాళధ్వనులతో మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. పలు ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, అధికారులకు సీఎం అభినందనలు తెలియజేశారు. ప్రజల సహకారం, భాగస్వామ్యం, అన్నివిభాగాల సమన్వయంతో యోగా డే గ్రాండ్ సక్సెస్ ముఖ్యమంత్రి అయ్యిందన్నారు. ప్రజల సహకారం, వారి క్రియాశీల భాగస్వామ్యం, అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో ఇది గొప్ప ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక యోగా డే హైలైట్స్ అంటూ ఒక వీడియో కూడా విడుద‌ల చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...