Homeలైఫ్​స్టైల్​Yoga | ఒత్తిడికి గురవుతున్నారా.. ఈ యోగాసనాలు చక్కటి పరిష్కారం..

Yoga | ఒత్తిడికి గురవుతున్నారా.. ఈ యోగాసనాలు చక్కటి పరిష్కారం..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Yoga | ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి(Stress)కి లోనవుతున్నారు. దీంతో రకరకాల మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి యోగా(Yoga) చక్కటి పరిష్కార మార్గంగా కనిపిస్తోంది.

పోటీ ప్రపంచంలో వేగం పెరిగింది. ఈ క్రమంలో చిన్న పిల్లల (Children) నుంచి వృద్ధులవరకు దాదాపు అందరూ ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లలకు హోమ్‌వర్క్‌ (Home work), ర్యాంకుల ఒత్తిళ్లు, యువకులకు పోటీ పరీక్షల ఒత్తిడి, పెద్దవాళ్లకు పని ఒత్తిడి (Work pressure) సర్వసాధారణంగా మారాయి. ఇవి మానసిక సంతులనం కోల్పోయేలా చేస్తున్నాయి. కంటినిండా నిద్ర కరువవుతోంది. దీంతో అనారోగ్య సమస్య(Health issues)ల బారిన పడుతున్నారు. ఈ ఒత్తిడి నుంచి దూరం కావడానికి యోగా ఒక చక్కటి మార్గంగా నిలుస్తోంది. యోగా గురువుల (Yoga instructors) సమక్షంలో శిక్షణ తీసుకుని క్రమం తప్పకుండా రోజూ సాధన (Practice) చేస్తే మానసిక ఒత్తిడి దూరమై ప్రశాంతత చేకూరే అవకాశాలు ఉంటాయి.

Yoga | ఏ ఏ ఆసనాలు వేయాలంటే..

రోజూ తప్పకుండా సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. వారంలో ఒకసారైనా జలనేతి, సూత్రనేతి, వమన ధౌతి వంటి క్రియలు, యోగనిద్ర సాధన చేయాలి. ఆయా ఆసనాల సాధన వల్ల హార్మోన్లు చక్కగా పనిచేస్తాయి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. ఇలా యోగా (Yoga), వ్యాయామాలు సాధన చేస్తూనే ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు ఉంటాయని యోగా గురువులు పేర్కొంటున్నారు.