అక్షరటుడే, కామారెడ్డి: Yoga Day | యోగా చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుడిమెట్ మహాదేవుని ఆలయ పీఠాధిపతి శ్రీ సద్గురు మహాదేవ్ స్వామీజీ (Sadhguru Mahadev Swamiji) అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా జిల్లా కేంద్రంలోని మెహెర్ బాబా గార్డెన్లో అంతర్జాతీయ యోగా గురువు బండి రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా మహోత్సవం కార్యక్రమంలో స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాను అంతర్జాతీయం చేయడంతో ప్రపంచ దేశాలు సైతం యోగాను అనుసరిస్తున్నాయని తెలిపారు. అంతకుముందు యోగా గురువు బండి రాములు 75 ఏళ్ల వయసులో యోగాసనాలను అవలీలగా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
యోగాడే రోజు పెళ్లిరోజు కావడం అదృష్టం
– యోగా గురువు బండి రాములు
అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున తన పెళ్లిరోజు కావడం తన అదృష్టమని యోగా గురువు బండి రాములు అన్నారు. యోగాతో తనకు గుర్తింపు లభించిందన్నారు. అనంతరం పెళ్లిరోజు సందర్భంగా బండి రాములు దంపతులను స్వామిజీలు శాలువాతో సత్కరించారు.