Homeలైఫ్​స్టైల్​Yoga | యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

Yoga | యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Yoga | యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా తయారవుతాం. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాలు పెరుగుతాయి. ఏకాగ్రత పెంపొందుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి యోగా సాధన(Yoga Practicing) ఉపయోగపడుతుంది. అలాగే పలు రకాల రుగ్మతలను దూరం చేసుకోవడానికీ ఇది మేలైన సాధనం. నిత్యం సాధన చేస్తే కీళ్ల నొప్పులు, అజీర్ణం, గ్యాస్‌, నిద్రలేమి తదితర సమస్యలనుంచి దూరం కావచ్చు. సూర్య నమస్కారాలతో ఆరోగ్యంతోపాటు ఆయుష్షూ పెరుగుతుందని యోగా గురువులు(Yoga teachers) పేర్కొంటారు. గురువు సమక్షంలో నేర్చుకుని క్రమంతప్పకుండా సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Yoga | జూన్‌ 21న యోగా దినోత్సవం ఎందుకంటే..

ప్రపంచం 2015 జూన్‌ 21 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీనికి కారణం మన ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) చేసిన ప్రతిపాదనే.. 2014 సెప్టెంబర్‌ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదన చేశారు. ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి 177 మంది ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు మద్దతు ఇవ్వడంతో విస్తృతమైన చర్చల తర్వాత ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. 2015 జూన్‌ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా అట్టహాసంగా నిర్వహించారు.

Yoga | ఆ రోజే ఎందుకంటే..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జూన్‌ 21వ తేదీనే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) జరుపుకోవాలని ప్రతిపాదించడం వెనక ఆసక్తికర విషయం ఉంది. ఆ రోజున ఉత్తరార్ధ గోళంలో అత్యధిక పగటి సమయం ఉంటుందని, అందుకే ఆ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటే బాగుంటుందని ఐక్యరాజ్య సమితి(United Nations)కి ప్రధాని మోదీ సూచించినట్లు కథనం ప్రచారంలో ఉంది. దీనికి ఐక్యరాజ్య సమితి ఓకే చెప్పడంతో ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోంది.