Homeతాజావార్తలుYoga | పరగడుపున యోగా.. ప్రయోజనాలెన్నో..

Yoga | పరగడుపున యోగా.. ప్రయోజనాలెన్నో..

యోగాసనాలు వేయడం ద్వారా శారీరక ఆరోగ్యం చేకూరడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అయితే పరగడుపున యోగా చేయడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు యోగా గురువులు.

- Advertisement -

అక్షర టుడే, వెబ్‌డెస్క్: Yoga | యోగా సాధన(Yoga sadhana) ద్వారా శారీరక ఆరోగ్యం చేకూరుతుంది. దీంతోపాటు మానసిక ఆందోళనలు దూరమవుతాయి. యోగా శారీరక మానసిక వికాసాలకే కాదు.. ఆధ్యాత్మిక వికాసానికీ ఉపయోగపడుతుంది. యోగం అంటే జోడిరచడం అని అర్థం. అంటే మనస్సును కామక్రోధాది షడ్వికారాలనుంచి దూరం చేసి పరమేశ్వరుడితో జోడిరచడం అన్నమాట.

ఇది యోగాభ్యాసం ద్వారానే సాధ్యపడుతుంది. అయితే యోగా చేయడానికి ఏది సరైన సమయం(right time), ఎప్పుడు చేస్తే అధిక ప్రయోజనాలు ఉంటాయి అన్న విషయమై సాధకులకు సందేహాలు రావడం సహజం. దీనికి యోగా గురువులు ఇచ్చే సమాధానం ఏమిటంటే యోగాసనాలు తప్పనిసరిగా పరగడుపున చేయాలని.. అంతేకాకుండా దైనందిన జీవితంలో కనీసం 15 నిమిషాలు(15 minutes) యోగాకు కేటాయించాలని వారు సూచిస్తున్నారు.

Yoga | యోగా ఎందుకంటే..

సరైన దినచర్య లేకపోవడంతో అనారోగ్య సమస్యలు(Health issues) పెరిగిపోతున్నాయి. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినడం లాంటి అలవాట్ల కారణంగా పేగుల్లో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. మలబద్ధకం సమస్య తలెత్తుతోంది. దీనికి తోడు తగిన శారీరక వ్యాయామం లేని కారణంగా చిన్న వయసులోనే ఊబకాయంతోపాటు షుగర్‌, బీపీ(BP) లాంటివి వస్తున్నాయి. ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు వాకింగ్‌(Walking), జాగింగ్‌తోపాటు యోగా కూడా చేయాలి.

Yoga | ఖాళీ కడుపుతో చేస్తే..

ఉదయం నిద్రలేవగానే ఏమీ తినక ముందే(Empty stomach) ఆసనాలు వేయడం ఉత్తమం. స్పష్టంగా చెప్పాలంటే ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని ఖాళీ కడుపుతో యోగా మొదలు పెట్టాలి. ఎప్పుడైతే పొట్ట అంతా క్లీన్‌ అయిపోతుందో అప్పుడు జీర్ణ వ్యవస్థ మరింత క్రియాశీలకంగా ఉంటుంది. దీంతో యోగాతో కలిగే లాభాలు రెట్టింపు అవుతాయి.

మోకాళ్లపై ఒత్తిడి పడేలా చేసే ఆసనాలతో పాటు పొత్తి కడుపుపై ప్రెజర్‌(Pressure) పెంచే ఆసనాలు చేయడం ద్వారా పొట్టలో ఉబ్బరం, అజీర్తి లాంటివి పూర్తిగా తగ్గిపోతాయి. సూర్య నమస్కారాలులాంటివి కేలరీలను కరిగిస్తాయి. ప్రాణాయామంతో నరాల వ్యవస్థ యాక్టివ్‌ అవుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగవుతుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల ఆరోగ్యంగానూ ఉంటారు. యోగా చేసే సమయంలో గోరు వెచ్చని నీళ్లు, తేనె(Honey) తప్ప ఇంకేదీ తీసుకోవద్దని యోగా గురువులు సూచిస్తున్నారు.