అక్షరటుడే, ఇందూరు: Yoga | మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని వినాయక నగర్ శ్రీనగర్ కాలనీలో ఆదివారం ఆరోగ్య యోగా కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధునిక జీవనశైలిలో మానవుడు శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని పొందే అవకాశం ఉందని తెలిపారు. ఆరోగ్య కేంద్రాల స్థాపన ద్వారా ప్రజారోగ్యం అభివృద్ధి చెందుతుందన్నారు.
ప్రతి ఒక్కరూ రోజువారి దినచర్యలో యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పంచ రెడ్డి లావణ్య లింగం, యోగా గురువులు రంజిత్, బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, మఠం పవన్, హరీష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.