ePaper
More
    Homeఅంతర్జాతీయంYoga Day | ఎల్​బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైన యోగా డే కౌంట్​డౌన్​

    Yoga Day | ఎల్​బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైన యోగా డే కౌంట్​డౌన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yoga Day | హైదరాబాద్​ నగరంలోని ఎల్​బీ స్టేడియం(LB Stadium)లో శుక్రవారం ఉదయం అంతర్జాతీయ యోగాడే సందర్భంగా కౌంట్​డౌన్​ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి(Union Minister Kishan Reddy) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే నటినటులు సాయిధరమ్‌ తేజ్, ఖుష్బూ, ​మీనాక్షి చౌదరి, తేజ సజ్జ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో 40 వేలకు పైగా ప్రజలు పాల్గొన్నారు.

    Yoga Day | యోగా జీవితంతో భాగం కావాలి

    యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. ప్రపంచానికి మోదీ(PM Modi) ఇచ్చిన బహుమతి యోగా అని పేర్కొన్నారు. ఎల్​బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా డే (International Yoga Day) వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. 24 గంటల ముందు కౌంట్ డౌన్ మహోత్సవాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.

    Yoga Day | యోగా డేకు సిద్ధం

    ప్రపంచ వ్యాప్తంగా యోగా డేను శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా యోగా డే కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 2014లో ప్రధాని మోదీ కృషి ఫలితంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా ఘనంగా యోగా డే నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో జరిగే యోగా డే వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...