అక్షరటుడే, ఇందూరు: Yoga day | నిత్య జీవితంలో యోగా భాగం కావాలని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీరావు అన్నారు. నగరంలోని సుభాష్ నగర్ కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ (Kakatiya Olympiad School)లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు సూర్య నమస్కారంతో పాటు యోగాసనాలు వేశారు. అనంతరం డైరెక్టర్ రామోజీరావు మాట్లాడుతూ.. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ప్రతి రోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం సీనియర్ యోగా అభ్యాసకుడు గంగాధర్ తో పాటు యోగాలో రాణించిన విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో కాకతీయ (Kakatiya Educationals Institutions) ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీరావు
