అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Yoga Association Summer camp | నగరంలో యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు ఐశ్వర్యకాలే, గంగాధర్ పేర్కొన్నారు. గంగస్థాన్ ఫేజ్–2 (Gangasthan Phase-2) ఉన్న నుడా(NUDA) పార్క్లో క్యాంప్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. వాలీబాల్ (Volleyball), యోగా, కరాటే, బ్యాడ్మింటన్ (Badminton), కర్రసాము, కబడ్డీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, క్యారం, చెస్, రంగోలి, ఫన్గేమ్స్ నిర్వహిస్తున్నామని వివరించారు. అనుభవజ్ఞులైన శిక్షకులతో క్యాంప్ ఏర్పాటు చేశామని ఆసక్తి గల వారు సమాచారం కోసం 8074982200, 9908812413, 9908713628, 7386908518లలో సంప్రదించవచ్చిన వివరించారు.