అక్షరటుడే, ఇందూరు: Yoga asana competitions | రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు శనివారం నిజామాబాద్ జిల్లా Nizamabad district విద్యార్థులు Students బయలుదేరారు.
ఈ నెల 6వ తేదీన జిల్లా కేంద్రంలోని ఉమామహేశ్వర Umamaheswara ఫంక్షన్ హాల్లో 16వ జిల్లా స్థాయి యోగాసన పోటీలు competitions జరిగాయి.
Yoga asana competitions | నార్సింగ్‌లో పోటీలు..
ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. రంగారెడ్డి Rangareddy జిల్లా నార్సింగ్‌లోని SMP ఇంటర్నేషనల్ International స్కూల్లో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా క్రీడాకారులు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు డీవైఎస్వో (DYSO) పవన్ కుమార్ ధ్రువపత్రాలు ప్రదానం చేసి, అభినందనలు తెలిపారు.
రాష్ట్రస్థాయిలో కూడా పథకాలు సాధించి జిల్లా పేరు నిలబెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్, ఉపాధ్యక్షురాలు రజిత, కోశాధికారి కమలవాని, గాయత్రి సంగీత, లోహిత పాల్గొన్నారు.