అక్షరటుడే,ఎల్లారెడ్డి : Yellareddy Postal Ballot Results | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality) ఎన్నికల ఓట్ల కౌంటింగ్ స్థానిక డిగ్రీ కళాశాలలో ప్రారంభమైంది. ముందుగా బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో తరలించి లెక్కించారు.
Yellareddy Postal Ballot Results | పోస్టల్ బ్యాలెట్లో..
ఎల్లారెడ్డి పట్టణానికి సంబంధించి మొత్తంగా 45 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్‌కు 27 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్కు 7, బీజేపీ 3, బీఎస్పీ 1, ఇండిపెండెంట్లకు 4 ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్ (Congress) పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉంది.
8 గంటలకు ప్రారంభమైన పోలింగ్..
ఉదయం 8 గంటలకు ఓట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు ప్రారంభించారు. ప్రతి వార్డుకు రెండు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా, 12 వార్డుల్లో 24 బూత్‌లకు సంబంధించిన 24 బ్యాలెట్ బాక్సులు 12 టేబుళ్లపై ఒకేసారి లెక్కించనున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 10,581 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లను లెక్కించేందుకు 12 వార్డులకు 12 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై సూపర్వైజర్, ఇద్దరు సహాయక అధికారులను నియమించారు. రెండు వార్డులకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను ఒకేచోట కలిపి కౌంటింగ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. 29 మంది సిబ్బందిని ఎన్నికల కౌంటింగ్ (Election counting)కు నియమించారు.