అక్షరటుడే,ఎల్లారెడ్డి : Municipal Tax | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality)కి నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మూడు రోజుల్లో భారీగా ఆదాయం సమకూరిందని మున్సిపల్ కమిషనర్ (Municipal Commissioner) మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం వివరాలు వెల్లడించారు.
Municipal Tax | మూడు రోజుల్లోనే..
మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ 28వ తేదీన ప్రారంభం కావడంతో.. కౌన్సిలర్లుగా పోటీచేసే అభ్యర్థుల ఇంటి ట్యాక్స్‌తో పాటు మద్దతుదారుల ఇంటి ట్యాక్స్లుచెల్లించేందుకు ముందుకు వచ్చారు. మొదటి రోజు 28న రూ.2,08,491 ఆస్తి పన్ను, రూ.74,300 వాటర్ టాక్స్ కలిపి 2,82,791 ఆదాయం వచ్చింది. అలాగే రెండో రోజు 29న ఆస్తిపన్ను రూ.1,06,430, వాటర్ టాక్స్ రూ.53,025 కలిపి రూ.1,59,455 ఆదాయం సమకూరింది. మూడోరోజైన శనివారం రోజు 30న ఆస్తి పన్ను రూ.42,615, వాటర్ టాక్స్ రూ.31,175 కలిపి రూ.73,790 ఆదాయం వచ్చింది.
Municipal Tax | ఇంటింటికీ తిరిగినా రాని బకాయిలు..
మొత్తంగా 3 రోజుల్లో కలిపి ఆస్తిపన్ను రూ.3,57,536, వాటర్ టాక్స్ రూ.1,58,500 కలిపి మొత్తం రూ.5.50 లక్షల ఆదాయం వచ్చింది. మున్సిపల్ పరిధిలో రోజుల తరబడి ఇంటింటికీ తిరిగినా ఇంటి ట్యాక్స్ కట్టడంలో జాప్యం చేస్తున్న తరుణంలో మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని బకాయిలు వసూలవ్వడంపై మున్సిపల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేసే అభ్యర్థుల నుంచి టాక్స్ వసూలు చేసేందుకు మున్సిపల్ మేనేజర్ వాసంతి (Municipal Manager Vasanthi), వార్డు అధికారులు అంజయ్య, సూర్యవర్ధన్, స్వామి, బిల్ కలెక్టర్ల బృందంతో రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి బకాయిలు వసూలు చేశారు.