అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy Municipality Results | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality)ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో చివరకు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ మేరకు మున్సిపాలిటీలో కాంగ్రెస్ (Congress) స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.
Yellareddy Municipality Results | గెలిచిన అభ్యర్థులు వీరే..
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 1వ వార్డు గాయత్రి(కాంగ్రెస్), 2వ వార్డు మహేశ్వరి(కాంగ్రెస్), 3వ వార్డు కౌసర్ ఉన్నీసా బేగం(కాంగ్రెస్), 4వ వార్డు దుంపల మంజుల (కాంగ్రెస్), 5వ వార్డు అట్కరి చంద్రయ్య (కాంగ్రెస్), 6వ వార్డు సయ్యద్ గఫార్ (కాంగ్రెస్), 7వ వార్డు భాగ్యవతి (కాంగ్రెస్), 8వ వార్డు సిద్ధి శ్రీధర్ (స్వతంత్ర), 9వ వార్డు గాదె తిరుపతి (కాంగ్రెస్), 10వార్డు పద్మ శ్రీకాంత్ (కాంగ్రెస్), 11వ వార్డు లక్ష్మీ రామగళ్ల (బీఆర్ఎస్), 12 ఎరుకల దశరథం(కాంగ్రెస్).
కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. పది వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. బీఆర్ఎస్ ఒక వార్డుకు పరిమితం అయింది. స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో గెలుపొందగా.. బీజేపీ ఖాతా తెరవలేదు.