అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy Municipality Congress Victory | ఎల్లారెడ్డి బల్దియా ఏర్పాటైన తర్వాత జరిగిన రెండో సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 స్థానాలకు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో, బీఆర్ఎస్ ఒక స్థానం, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
Yellareddy Municipality Congress Victory | ఏకపక్షంగా మద్దతు..
మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ఓటర్లు పూర్తి ఏకపక్షంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌కు బీజేపీ, బీఆర్ఎస్లు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి. బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ప్రచారం నిర్వహించినా ఓటర్లు ప్రసన్నం కాలేదు. బీజేపీ ముఖ్య నాయకులు విస్తృతంగా పర్యటించినప్పటికీ ఆ పార్టీని సైతం ఓటర్లు ఆదరించలేదు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక వ్యూహం పన్ని ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించారు.
Yellareddy Municipality Congress Victory | అంతా తానై గెలిపించిన ఎమ్మెల్యే..
ఎల్లారెడ్డి (Yellareddy) బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ప్రముఖ పాత్ర పోషించారు. మొత్తం తానై పార్టీని నడిపించి ఎల్లారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి పోలింగ్ ముగిసే వరకు తన రాజకీయ చాతుర్యాన్ని ఎమ్మెల్యే ప్రదర్శించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక స్థానానికి మించి గెలవలేకపోయింది. 12 స్థానాలు గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వ్యూహాలు రచించగా కాంగ్రెస్ పార్టీ పది స్థానాలు కైవసం చేసుకుంది.
12 వార్డుల్లో..
12 వార్డుల్లో కలిపి 10,581 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్ పార్టీకి 6,173 ఓట్లు వచ్చాయి. దాదాపు 64 శాతం ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి 2,431 ఓట్లు, బీజేపీ కేవలం 637 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీని తట్టుకొని ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు సిద్ధి శ్రీధర్ గుప్తా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఏకపక్షంగా సాగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కమ్మల గాయత్రికి 596 ఓట్లు రాగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అల్లం ప్రసీలకు 155 ఓట్లు వచ్చాయి. 441 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి చెందిన మంచిర్యాల మహేశ్వరికి 400 ఓట్లు పడగా, బీఆర్ఎస్ అభ్యర్థి మంగలి పద్మకు 297 ఓట్లు వచ్చాయి. 103 ఓట్ల మెజారిటీతో మహేశ్వరి గెలుపొందింది.
మూడో వార్డులో..
మూడో వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌసర్ ఉన్నిస్తా 665 ఓట్లు సాధించగా, బీఆర్ఎస్ అభ్యర్థి జీనత్ సుల్తానాకు 147 ఓట్లు వచ్చాయి, 518 ఓట్ల మెజారిటీతో కౌసర్ గెలుపొందింది. నాలుగవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దుంపల మంజులకు 483 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల సుజాతకు 300 ఓట్లు పోలయ్యాయి. 183 ఓట్ల మెజారిటీతో దుంపల మంజుల విజయం సాధించింది. ఐదవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి (Congress Candidate) అట్కారి చంద్రయ్య 472 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి చర్ల దేవయ్యకు 444 ఓట్లు వచ్చాయి. కేవలం 28 ఓట్ల మెజారిటీతో చంద్రయ్య గెలుపొందాడు. ఆరో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ గఫర్‌కు 474 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి బేకరీ మహేందర్ కు 301 ఓట్లు పోలయ్యాయి. సయ్యద్ గఫర్ ఒక 173 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఏడోవార్డులో మతమల భాగ్యవతి 755 ఓట్ల రాగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి (BRS Party Candidate) మంగలి కావ్యకు 58 ఓట్లు పోలయ్యాయి. 697 ఓట్ల భారీ మెజారిటీతో భాగ్యవతి విజయం సాధించారు. 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నునుగొండ శ్రీనివాస్‌కు 260 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి సిద్ధి శ్రీధర్ గుప్తాకు 444 ఓట్లు పోలయ్యాయి.
సిద్ది శ్రీధర్ గుప్తా 184 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గాదె తిరుపతికి 624 ఓట్లు పోలవ్వగా, బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ నయాంకు 173 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తిరుపతి 451 ఒక్క ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పదోవార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పద్మ శ్రీకాంత్‌కు 590 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ యూనిస్‌కు కేవలం 145 ఓట్లు మాత్రమే వచ్చాయి. పద్మ శ్రీకాంత్ 445 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వప్నకు 362 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రామగల లక్ష్మికి 554 ఓట్లు వచ్చాయి. రామగల లక్ష్మి 192 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎరుకల దశరథం కు 492 ఓట్లు రాగా, బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఎరుకల సాయిలకు 291 ఓట్లు పోలయ్యాయి. ఎరుకల దశరథం 191 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 9 వార్డుల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. 5 వార్డులో మాత్రమే
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. మిగతా 8 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో దూసుకుపోయారు.