అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy Municipal Vote Counting | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ను అధికారులు స్థానిక డిగ్రీ కళాశాలలో ప్రారంభించారు. కళాశాలలో ఉన్న బ్యాలెట్ బాక్స్‌లను అధికారులు ముందుగా కౌంటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలో తరలించారు.
Yellareddy Municipal Vote Counting | మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..
ఉదయం 8 గంటలకు ఓట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు ప్రారంభించారు. 42 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ప్రతి వార్డుకు రెండు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా, 12 వార్డుల్లో 24 బూత్‌లకు సంబంధించిన 24 బ్యాలెట్ బాక్సులు 12 టేబుళ్లపై ఒకేసారి లెక్కించనున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality)లో 10,581 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లను లెక్కించేందుకు 12 వార్డులకు 12 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై సూపర్వైజర్, ఇద్దరు సహాయక అధికారులను నియమించారు. రెండు వార్డులకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను ఒకేచోట కలిపి కౌంటింగ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. 29 మంది సిబ్బందిని ఎన్నికల కౌంటింగ్‌కు నియమించారు.
Yellareddy Municipal Vote Counting | ప్రారంభమైన రెండు, మూడు గంటల్లోనే..
ఒకే రౌండ్లో కౌంటింగ్ పూర్తి చేసేందుకు ఎన్నికల నిర్వహణ అధికారులు చర్యలు తీసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న బ్యాలెట్ బాక్స్‌లకు భారీ భద్రతతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో సైతం సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. రెండు మూడు గంటల్లో వార్డుల ఫలితాలు వెల్లడయే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాన్ని ఆర్డీవో పార్థసింహారెడ్డి (RDO Parthasimha Reddy), ఎన్నికల నిర్వహణ అధికారి రాజ్‌నాథ్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ మహేష్ (Municipal Commissioner Mahesh), అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలను అధికారులు తీసుకున్నారు. కమిటీ కేంద్రం వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక డీఎస్పీ శ్రీనివాసరావు (DSP Srinivasa Rao) పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు బందోబస్తుకు నేతృత్వం వహించనున్నారు.