అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA Madan Mohan | ఎల్లారెడ్డి ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చి తమను బల్దియా (Yellareddy Municipality) ఎన్నికల్లో గెలిపించారని.. పట్టణాన్ని సర్వాంగ సుదరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మదన్మోహన్ తెలిపారు. బల్దియాలో పాలకవర్గం ప్రమాణస్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Yellareddy MLA Madan Mohan | ప్రతిపక్ష పార్టీలకు ఘోర ఓటమి..
ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Yellareddy Congress) అభ్యర్థులకు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించడంతో తమ బాధ్యత మరింత పెరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ రాకుండా ఓటర్లు తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. తమపై నమ్మకంతో ప్రజలు 60 శాతం ఓట్లు వేసి భారీ మెజార్టీ ఇచ్చారన్నారు. ప్రతిపక్షానికి చెందిన పెద్దపెద్ద నాయకులు వచ్చి ప్రచారం చేసినా ప్రజలు తనకు మద్దతుగా నిలిచారన్నారు.
అభివృద్ధి చేస్తాం
ఎల్లారెడ్డి పట్టణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు. పట్టణంలో అన్ని ప్రాంతాలకు సీసీ రోడ్డు, డ్రెయినేజీలు తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. పట్టణంలో నిర్మించిన బస్టాండ్ గురించి బయట పట్టణాల్లో చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. పెద్ద చెరువు గట్టుపై మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించారని చెప్పారు. ఆయన వెంట స్థానిక కౌన్సిలర్లు ఉన్నారు.