అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy CC Road Works | ఎల్లారెడ్డి మండలంలోని సోమార్పేట్లో నెలరోజుల క్రితం సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం గ్రామంలో పనులు ప్రారంభమయ్యేలా కృషి చేశారు.
Yellareddy CC Road Works | రూ.25లక్షల వ్యయంతో సీసీ రోడ్డు..
నెల రోజుల క్రితం స్థానిక మండల ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరుకావాలని ఆర్యవైశ్యులు హైదరాబాద్లో ఎమ్మెల్యేను (Hyderabad MLA) కలిశారు. అలాగే సోమార్పేట్ రోడ్డులోని శ్మశాన వాటికకు రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని విన్నవించారు. సీసీరోడ్డు నిర్మాణంతో ఆర్యవైశ్య శ్మశానవాటికతో పాటు ఆ తర్వాత ఉన్న మిగతా శ్మశానవాటికలకు కూడా ఉపయోగంగా ఉంటుందని వివరించారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత శాఖ ఏఈతో ఫోన్లో మాట్లాడారని.. రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
Yellareddy CC Road Works | సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం..
ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు సోమార్పేట్ గ్రామ (Somarpet Village) రహదారిలో ఉన్న వైశ్య శ్మశాన వాటికకు వెళ్లే దారిలో సీసీ రోడ్డు పనులను మున్సిపల్ ఛైర్మన్ (Municipal Chairman) పద్మ శ్రీకాంత్ నేతృత్వంలో కౌన్సిలర్లు బుధవారం ప్రారంభించారు. సుమారు రూ.25 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను చేపట్టారు. ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు మాజీ ఎంపీపీ చెన్న సతీశ్ గుప్తా, సిద్ది శ్రీధర్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ నూతన కార్యవర్గ సభ్యులతో పాటు పలువురు నాయకులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.