అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy mandal | సెలవులకు (holidays) ఊళ్లకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసు కళాబృందం (police kalabrundam) సభ్యులు పేర్కొన్నారు. మండలంలోని ఎస్బీఐ బ్యాంక్లో (SBI bank) గురువారం పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెలవుల్లో విద్యార్థుల ఈత నేర్చుకోవాలనుకుంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా తోడుగా ఉండాలన్నారు. సైబర్ మోసగాళ్లు (cyber criminals) ఉన్నందున ఎవరికీ ఫోన్లో ఓటీపీలు చెప్పవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ సీహెచ్ మహేశ్, కళాబృందం సభ్యులు, పోలీసు సిబ్బంది (police staff) తదితరులు పాల్గొన్నారు.
