అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Degree college | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు క్షేత్ర పర్యటన నిమిత్తం హైదరాబాద్ (Hyderabad) వెళ్లారని ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ నారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం వివరాలు వెల్లడించారు.
విహారయాత్రలో భాగంగా కళాశాల బీఏ, బీఎస్సీ ఎంపీసీ, ఎంపీఎస్ విద్యార్థులు హైదరాబాద్లోని అసెంబ్లీకి వెళ్లారని ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీ సమావేశాలను (Assembly Sessions) ప్రత్యక్షంగా వీక్షించారని వివరించారు. రవీంద్ర భారతి ఆడిటోరియం (Ravindra Bharathi Auditorium), బిర్లా ప్లానిటోరియం, బిర్లా సైన్స్ మ్యూజియం, బిర్లా పురావస్తు పరిశోధన కేంద్రం, బిర్లా స్పేస్ సెంటర్, బిర్లా వాస్తు శిల్పాలను తిలకంచారని పేర్కొన్నారు. అక్కడి నుండి సచివాలయంను సందర్శించ్చారు. అంబేడ్కర్ విగ్రహంను దర్శించి అంబేడ్కర్ మ్యూజియంను తిలకించారన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కలశాలను విద్యార్థులు దర్శించి వర్సిటీ ఆర్ట్స్ కళాశాల గొప్పదనాన్ని తెలుసుకున్నారని ప్రిన్సిపాల్ తెలిపారు. చివరకు క్షేత్ర పర్యటనలో భాగంగా శీతాఫాల్ మండిలో ఉన్న ది ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీని సందర్శించారు. ఈ క్షేత్ర పర్యటనకు కళాశాల నుండి 8 విభాగాలు వెళ్లాయని ఆయన తెలిపారు. ఇందులో పబ్లిక్ అడ్మినస్ట్రేషన్ విభాగం అధిపతి డాక్టర్ ఈ లక్ష్మీ నారాయణ, చరిత్ర విభాగం అధిపతి చంద్రకాంత్, అర్థ శాస్త్రం విభాగం అధిపతి కృష్ణ ప్రసాద్, పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి మోహిన్, గణిత శాస్త్రం విభాగం అధిపతి సిద్దు రాజు, కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి సురేష్ రెడ్డి, ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ విభాగం సంగీత, విద్యార్థులు పాల్గొన్నారు.