అక్షరటుడే, లింగంపేట: Yellareddy constituency | ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏకగ్రీవాల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం (Yellareddy constituency) రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని కాంగ్రెస్ నాయకుడు రఫీయొద్దీన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.
Yellareddy constituency | పంచాయతీ ఎన్నికల్లో..
రాష్ట్రంలో రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) చేస్తున్న అభివృద్ధిని చూసి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తంగా 46 పంచాయతీలు ఏకగ్రీవంగా నిలిచాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే ఇది ఒక రికార్డ్ అని ఆయన వెల్లడించారు.
Yellareddy constituency | ఎమ్మెల్యే సహకారంతోనే..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) ఆధ్వర్యంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ మద్దతుదారులను సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించారని ఆయన తెలిపారు. వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఊపులో కాంగ్రెస్‌కు జై కొట్టాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ జొన్నల రాజు, తదితరులు పాల్గొన్నారు.