అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Congress campaign | ఎల్లారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) నాయకత్వంలో పట్టణం మరింతగా అభివృద్ధి చెందుతోందని ఎంపీ సురేశ్ షెట్కార్ (MP Suresh Shetkar) తెలిపారు. ఎల్లారెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
Yellareddy Congress campaign | ఎల్లారెడ్డిలో గణనీయమైన మార్పు..
ఎల్లారెడ్డి పట్టణంలో (Yellareddy town) గత బీఆర్ఎస్ పాలనలో తట్టెడు మట్టి కూడా వేయలేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ఎల్లారెడ్డి అభివృద్ధి జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డిని దగ్గరుండి అభివృద్ధి చేస్తున్నారన్నారు. గతంతో పోలిస్తే నేడు ఎల్లారెడ్డిలో గణనీయమైన మార్పు కనిపిస్తోందన్నారు.
Yellareddy Congress campaign | సంక్షేమ పథకాల అమలు..
ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. ఎల్లారెడ్డి మినీట్యాంక్ బండ్, బస్స్టాండ్, ఏటీసీ సెంటర్(ATC Center), అమృత్ 2.0, ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు తదితర పనులు ప్రతిపక్షాలకు కనిపించట్లేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ఎల్లారెడ్డిని నేడు అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కౌన్సిలర్లనే గెలిపించాలి..
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బంపర్ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే, సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా అమలవ్వాలంటే ప్రజల తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.