అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy BRS vs Congress | కాంగ్రెస్ దండుపాల్యం బ్యాచ్ నుంచి ఎల్లారెడ్డిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ (Nallamadugu Surender) పిలుపునిచ్చారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Yellareddy BRS vs Congress | బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ది..
ఎల్లారెడ్డి (yellareddy) నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా బీఆర్ఎస్ (BRS) హయాంలో జరిగిందేనని నల్లమడుగు సురేందర్ అన్నారు. ఆయా పనులకు సంబంధించి తాను తీసుకొచ్చిన పనులకు సంబంధించిన జీవో పత్రాలను చూపుతూ ఆయన మాట్లాడుతూ ఆనాడు నూతన ఆర్టీసీ బస్టాండ్, సెంట్రల్ లైటింగ్ డివైడర్స్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, డయాలసిస్ సెంటర్, సీసీ రోడ్లు నిర్మాణం, పెద్ద చెరువుకట్ట పై రెండు వంతెనలు, చిల్డ్రన్స్ పార్క్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్, నూతన 100 పడకల ఆస్పత్రి పనులన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగినవేనన్నారు.
Yellareddy BRS vs Congress | నిధులు తెచ్చా.. అభివృద్ధి చేశా..
ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి (Yellareddy Municipality) అనేక నిధులు తెచ్చి అభివృద్ధి చేశానన్నారు. అప్పుడు చేసిన పనులకు నేడు ఎమ్మెల్యే మదన్మోహన్ ఆయన పేరు పెట్టుకుని ఫొటోలు దిగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు కాంగ్రెస్ నాయకులు అప్పట్లో జరిగిన పనులకు ఫొటోలు దిగడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదన్నారు. ఎమ్మెల్యే మదన్మోహన్కు ధైర్యం ఉంటే తాను కొత్తగా తీసుకొచ్చిన జీవోలు చూపించాలని సవాల్ విసిరారు.
Yellareddy BRS vs Congress | హామీలపై ప్రజలు ప్రశ్నించాలి..
మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ఓట్ల కోసం మీ ఇళ్లకు వచ్చే కాంగ్రెస్ నాయకులను.. ‘మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి’ అని ప్రశ్నించాలని మాజీ ఎమ్మెల్యే అన్నారు. ఎల్లారెడ్డిలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేందుకు ఎంతయినా ఖర్చు చేసి గెలవాలని అధిష్టానం చెబుతోందని.. గెలుపు కోసం కాగ్రెస్ నాయకులు ఎంతకైనా దిగజారుతారన్నారు. వ్యాపారులకు యువకులకు, ఉద్యోగులకు ఎమ్మెల్యే బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. వారందరికి ఓటుతోనే గుణపాఠం చెప్పాలని సూచించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ (BRS Councilor) అభ్యర్థులను గెలిపించుకుంటేనే ఎల్లారెడ్డిని కాపాడుకోగలమని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.