ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy MLA | ఎడ్యుకేషన్ హబ్​గా ఎల్లారెడ్డి.. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ

    Yellareddy MLA | ఎడ్యుకేషన్ హబ్​గా ఎల్లారెడ్డి.. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy MLA | ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని (yellareddy constituency) ఎడ్యుకేషన్​ హబ్​గా మార్చేందుకు ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు (MLA Madan Mohan) ప్రత్యేక చొరవ చూపుతున్నారు.

    కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఆయన నియోజకవర్గానికి అడ్వాన్స్​డ్​ టెక్నికల్ ట్రెయినింగ్​ సెంటర్​(ATC) మంజూరు చేయించారు. అనంతరం యంగ్​ ఇండియా రెసిడెన్సియల్​ స్కూల్ (Young India Residential School)​ కూడా తీసుకువచ్చారు. తాజాగా ఆ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేసింది.

    రాష్ట్రంలో మొదటి దశలో 55 నియోజకవర్గాల్లో యంగ్​ ఇండియా రెసిడెన్సియల్​ పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే అందులో 20 పాఠశాలల నిర్మాణానికి తాజాగా రూ.200 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసింది. మొత్తం రూ.4 వేల కోట్ల నిధులు విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జిల్లాలోని ఎల్లారెడి, బాన్సువాడ నియోజకవర్గ పాఠశాలలు ఉండటం గమానార్హం. నియోజకవర్గంలో పాఠశాల నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు ప్రత్యేక చొరవ చూపారు.

    Yellareddy MLA | వేగంగా ఏటీసీ నిర్మాణం

    ఎల్లారెడ్డి పట్టణంలో రూ.70 కోట్లతో అడ్వాన్స్​డ్​ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ (ATC) నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఐటీఐల స్థానంలో ఏటీసీలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మారుతున్న సాంకేతికత, అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. ఏటీసీలతో యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగు అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో ఎల్లారెడ్డిలో ఏటీసీ నిర్మాణాన్ని ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

    అలాగే.. నియోజకవర్గంలోని ఇతర పెండింగ్ పనులపైనా మదన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులు తెప్పించారు. త్వరలోనే ఎల్లారెడ్డి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...