అక్షరటుడే, డిచ్ పల్లి: Yellamma temple | మండలంలోని కోరట్ పల్లిలో ఆదివారం ఎల్లమ్మ ఆలయ రెండో వార్షికోత్సవం నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాల ఊరేగింపు నిర్వహించి, అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బోనాల ఊరేగింపు సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గౌడ సంఘ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
