అక్షరటుడే, ఎల్లారెడ్డి : Riyaz encounter | నిజామాబాద్ (Nizamabad) నగరంలో ఇటీవల సంచలనం సృష్టించిన రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై విచారణ అధికారిగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డీఎస్పీ (Yellareddy DSP) శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు.
కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod)ను హత్య చేసిన పాత నేరస్తుడు రియాజ్ ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్ తప్పించుకునే యత్నం చేయగా పోలీసులు కాల్పులు జరిపారు. దీనిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (State Human Rights Commission) సుమోటాగా స్వీకరించింది. నవంబర్ 24లోగా ఘటనపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఈ క్రమంలో ఎన్కౌంటర్పై విచారణకు ఎల్లారెడ్డి డీఎస్పీని డీజీపీ నియమించారు.
Riyaz encounter | గోప్యంగా..
ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగింది.. కాల్పులకు దారి తీసిన పరిస్థితులపై ఎల్లారెడ్డి డీఎస్పీ విచారణ చేపడుతున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఘటన జరిగిన ప్రాంతంలో ఆయన పరిశీలించారు. కాల్పులు జరిపిన ఏఆర్ పోలీసులతో సైతం మాట్లాడినట్లు సమాచారం. ఈ విచారణ భారీ బందోబస్తు మధ్య అత్యంత గోప్యంగా చేపడుతున్నట్లు తెలిసింది.