CI Transfer
CI Transfer | ఎల్లారెడ్డి సీఐ బదిలీ

అక్షరటుడే, లింగంపేట: CI Transfer | రాష్ట్రంలో పలువురు ఇన్​స్పెక్టర్లు బుధవారం బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా మొత్తం తొమ్మిది సీఐలను ట్రాన్స్​ఫర్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి సీఐ రవీంద్ర నాయక్​ను బదిలీ చేశారు. ఆయనను ఐజీపీ ఆఫీస్​(IGP Office)కు అటాచ్​ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రవీంద్ర నాయక్​ స్థానంలో ఎల్లారెడ్డి సీఐగా మెదక్ జిల్లా సీసీఎస్​లో పనిచేస్తున్న రాజారెడ్డి (Medak CI Rajaram) రానున్నారు. రాజారెడ్డి నిజామాబాద్​ జిల్లాలో సుదీర్ఘకాలం పాటు ఎస్సైగా పనిచేశారు. మాక్లూర్​, నవీపేట పోలీస్​స్టేషన్లలో ఎస్​హెచ్​వోగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం పదోన్నతిపై భైంసా సీఐగా వెళ్లారు. తదనంతరం మెదక్​ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఆయన డిచ్​పల్లి సీఐగా వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎల్లారెడ్డి సీఐగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

CI Transfer | సీఐ బదిలీపై చర్చ

సీఐ రవీంద్ర నాయక్​ బదిలీ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన బదిలీ వెనుక బలమైన కారణం ఉండి ఉంటుందని వారు చర్చించుకుంటున్నారు. రెండు నెలల కింద ఒక ఇష్యూలో బదిలీ అవుతారని ప్రచారం జోరుగా జరిగింది.

CI Transfer | రాష్ట్రంలో తొమ్మిది మంది ఇన్​స్పెక్టర్ల బదిలీ

మెదక్​ సీసీఎస్​లో పనిచేస్తున్న ఇన్​స్పెక్టర్​ డి.రాజా రెడ్డిని ఎల్లారెడ్డి సీఐ(Yella Reddy CI)గా బదిలీ చేశారు. ఎల్లారెడ్డి సర్కిల్​ ఇన్​స్పెక్టర్​గా ఉన్న బి.రవీంద్ర నాయక్​ను ఐజీపీ ఆఫీస్​(Ravindra Naik IGP Office)కు అటాచ్​ చేశారు. అలాగే వెయిటింగ్​లో ఉన్న వై.సంజీవరావును వరంగల్​ కమిషనరేట్​కు అటాచ్​ చేశారు. బెల్లంపల్లి ఒకటో టౌన్​ సీఐగా పనిచేస్తున్న నీలాల దేవయ్య(Nilala Devaiah)ను రామగుండంలోని తాండురు సీఐగా పంపించారు. తాండూరు సీఐ కన్నం కుమారస్వామిని ఐజీపీ కార్యాలయానికి అటాచ్​ చేశారు. అలాగే మధిర సీఐ దొంగరి మధు(Madhira CI Dongari Madhu)ను ఇటీవల ఖమ్మం కమిషనరేట్​కు అటాచ్​ చేయగా. తిరిగి మధిరకు పంపించారు. అలాగే కాగజ్​నగర్​ రూరల్​ సీఐ కుచన శ్రీనివాస్​ రావు(Kuchana Srinivas Rao)ను బెల్లంపల్లి–1 టౌన్​ సీఐగా నియమించారు. ఖమ్మం సీఎస్​బీ ఇన్​స్పెక్టర్​ చందవోలు హనూక్​(Chandavol Hanukkah)ను బెల్లంపల్లి రూరల్​ సీఐగా బదిలీ చేశారు. బెల్లంపల్లి రూరల్​ సీఐ అఫ్జలొద్దీన్(Bellampalli Rural CI Afzaluddin)​ను ఐజీపీ ఆఫీస్​కు అటాచ్​ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.