HomeతెలంగాణJankampet temple | జానకంపేట్ లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Jankampet temple | జానకంపేట్ లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Jankampet temple | అమావాస్య శనివారం రావడంతో ఎడపల్లి మండలం జానకంపేట లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ఈ సందర్భంగా అష్టముఖి కోనేరులో (Ashtamukhi Koneru) స్నానాలు చేసేందుకు పోటీ పడ్డారు. ఎడ్ల పొలాల అమావాస్య కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది.

Jankampet temple | శనివారం అమావాస్య రావడంతో..

శ్రావణమాసంలో శనివారం ప్రత్యేకంగా అమావాస్య రావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఆలయాలను దర్శించుకున్నారు. ముఖ్యంగా జానకంపేట లక్ష్మీనృసింహాస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రతి అమావాస్యకు ఈ ఆలయానికి భక్తులు భారీ తరలివస్తారు.

జానకంపేట కోనేరులో స్నానమాచరించి.. ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు

ఆలయంలో భక్తల క్యూ..

Must Read
Related News