HomeతెలంగాణNaleshwar | నాళేశ్వర్​లో భక్తిశ్రద్ధలతో ఎడ్ల పొలాల అమావాస్య

Naleshwar | నాళేశ్వర్​లో భక్తిశ్రద్ధలతో ఎడ్ల పొలాల అమావాస్య

- Advertisement -

అక్షరటుడే, నవీపేట్​: Naleshwar | నవీపేట్ (Navipet)​ మండలంలోని నాళేశ్వర్​లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఎడ్లపొలాల అమావాస్యను (Yedla Polala Amavasya) నిర్వహించారు. ఈ సందర్భంగా బినోల సొసైటీ ఛైర్మన్​ మగ్గరి హన్మాండ్లు (Maggari Hanmandlu) ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

Naleshwar | అందంగా బస్వన్నల అలంకరణ..

ఎడ్లపొలాల అమవాస్య సందర్భంగా బస్వన్నలను అందంగా ముస్తాబు చేసి నాళేశ్వర్​లో ఊరేగించారు. హనుమన్ ఆలయ మందిరంలో పూజలు నిర్వహించి బస్వన్నలతో ప్రదక్షిణలు చేయించారు. పాడి పంటలు బాగా పండాలని గ్రామస్థులు మొక్కులు తీర్చుకున్నారు.

కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సరీన్, యువ నాయకులు చిన్నదోడ్డి ప్రవీణ్, సతీష్, భూమేష్, గణేష్, గ్రామాబివృద్ధి కమిటీ సభ్యులు రమేష్, శ్యాం, నవీన్, సాయినాథ్, గంగాధర్, రాజేందర్, రాజు, గ్రామస్థులు కోలకొండ భూమేష్​, భీమారెడ్డి, గణేష్, సంజీవ్, రమేష్, సురేష్, నవీన్, రాజు రైతులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.