అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Yedapalli | ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శుక్రవారం ఎడపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడపల్లి మండలం ఎంఎస్సీ ఫారంనకు చెందిన శైలేష్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. దీంతో మనస్థాపానికి గురై శుక్రవారం జానకంపేట్ చెరువులో దూకాడు. గమనించిన స్థానికులు అతడిని కాపాడారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.