ePaper
More
    Homeక్రీడలుODI Cricket | ఒక్క‌సారి కూడా డకౌట్ కాలేదు.. వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు...

    ODI Cricket | ఒక్క‌సారి కూడా డకౌట్ కాలేదు.. వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన బ్యాటర్లు ఎవ‌రంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: ODI Cricket | క్రికెట్ చరిత్రలో పరుగుల వర్షం కురిపించిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. అయితే, కొంతమంది బ్యాటర్లకి మాత్రం ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది .వారెప్పుడూ “డక్” అంటే సున్నా పరుగుల వద్ద అవుట్ కాలేదు. ఇది ఆశ్చర్యం కలిగించకమానదు.

    ప్రత్యేకంగా ఈ జాబితాలో ఒక భారత క్రికెటర్(Indian Cricketer) పేరు ఉండటం గర్వకారణం. ఎప్పుడూ డకౌట్ కాని భారత బ్యాటర్ మ‌రెవ‌రో కాదు లెజెండరీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ(Yashpal Sharma). టీమిండియాకి సేవలందించిన ఈ దిగ్గజం తన వన్డే కెరీర్‌లో ఒక్కసారి కూడా సున్నా వద్ద అవుట్ కాలేదు. అతను 42 వన్డేలు ఆడి 883 పరుగులు, 4 హాఫ్ సెంచరీలు చేశాడు. అతని అత్యధిక స్కోరు 89 పరుగులు.

    80ల కాలంలో వెస్టిండీస్,ఆస్ట్రేలియా , సౌతాఫ్రికా జ‌ట్ల‌కి చెందిన బౌల‌ర్స్ ప్రమాదకర బౌలింగ్ తో ఎలా హ‌డ‌లెత్తించేవారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాంటి సమయంలోనూ డకౌట్(Duck Out) కాకుండా నిల‌క‌డ‌గా బ్యాటింగ్ చేయడం నిజంగా అభినందనీయం.

    ఈ అరుదైన ఘనత సాధించిన ఇతర అంతర్జాతీయ బ్యాటర్లు ఎవ‌ర‌నేది చూస్తే:

    1. పీటర్ కిర్స్టన్ (దక్షిణాఫ్రికా)

    • మ్యాచులు: 40
    • పరుగులు: 1293
    • హాఫ్ సెంచరీలు: 9
    • అత్యధిక స్కోరు: 97
    • నాటౌట్ ఇన్నింగ్స్: 6

    డకౌట్ లేదు.

    3 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికా తరపున క్రికెట్ ఆడిన పీటర్, ఎప్పుడూ సున్నా వద్ద అవుట్ కాలేదు. ఆయన ఆట తీరులో నిలకడే ప్ర‌త్యేక ఆకర్షణ.

    2. కెప్లర్ వెస్సెల్స్ (ఆస్ట్రేలియా/దక్షిణాఫ్రికా)

    • మ్యాచులు: 109
    • పరుగులు: 3367
    • సెంచరీలు: 1
    • హాఫ్ సెంచరీలు: 26
    • అత్యధిక స్కోరు: 107
    • నాటౌట్ ఇన్నింగ్స్: 7

    డకౌట్ లేదు.

    ఒకే వ్యక్తిగా రెండు దేశాల తరపున ఆడిన అరుదైన క్రికెటర్ కెప్లర్ వెస్సెల్స్ కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు.

    3. జాక్వెస్ రోడ్లాఫ్ (దక్షిణాఫ్రికా)

    • మ్యాచులు: 45
    • పరుగులు: 1174
    • హాఫ్ సెంచరీలు: 7
    • అత్యధిక స్కోరు: 81
    • నాటౌట్ ఇన్నింగ్స్: 6

    డకౌట్ లేదు.

    జాక్వెస్ రోడ్లాఫ్ కూడా తన పూర్తి వన్డే కెరీర్‌లో ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు.

    క్రికెట్‌లో చిన్న త‌ప్పుతో బ్యాటర్ డకౌట్ కావడం సహజం. కానీ ఈ ఆటగాళ్లు ఎంతో క్రమశిక్షణతో, స్టెడి పర్ఫార్మెన్స్‌తో ఎప్పుడూ “సున్నాకి ఔట్ కాకుండా తమ బ్యాటింగ్ కెరీర్‌ను కొనసాగించగలిగారు. ఇది సాధారణమైన విషయం కాదు. ఇంత‌టి క‌న్సిస్టెన్సీ, కూల్ మైండ్‌తో ప్ర‌తీ ఇన్నింగ్స్ ఆడి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నారు

    More like this

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...

    GPO | రెవెన్యూశాఖపై అవినీతి ముద్రను తొలగించే బాధ్యత జీపీవోలదే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను...