అక్షరటుడే, వెబ్‌డెస్క్: Toxic Movie Teaser | కన్నడ సినీ పరిశ్రమ (Kannada Film Industry) నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన రాకింగ్ స్టార్ యష్, అభిమానుల ఎదురుచూపులకు చివరికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మోస్ట్ అవేటెడ్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి విడుదలైన టీజర్ సోషల్ మీడియా (Social Media)లో సంచలనంగా మారింది.
‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యష్ (Hero Yash) నుంచి వస్తున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో, ఈ టీజర్‌పై మొదటి నుంచే భారీ ఆసక్తి నెలకొంది.సుమారు మూడు నిమిషాల నిడివితో విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులను ఒక చీకటి, హింసాత్మక అండర్‌వల్డ్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. యష్ ఇందులో రాయా అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నట్లు స్పష్టమైంది.
Toxic Movie Teaser | గూస్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్..
స్మశాన వాతావరణం మధ్య కారుతో ఇచ్చే ఎంట్రీ, ఆ వెంటనే కనిపించే యష్ లుక్ టీజర్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, నోట్లో సిగార్‌తో పాటు చేతిలో ఆధునిక ఆయుధం… యష్ ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో మరింత రా, మరింత రూత్‌లెస్‌గా కనిపించారు. టీజర్ మొత్తం డైలాగ్స్ కన్నా విజువల్స్, మ్యూజిక్‌నే ఎక్కువగా మాట్లాడుతున్నాయి. చివర్లో యష్ పలికే “డాడీ ఈజ్ హోమ్” అనే లైన్ అభిమానుల్లో అప్పుడే హైప్ క్రియేట్ చేస్తోంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Director Geethu Mohandas) ఈ చిత్రాన్ని సాంప్రదాయ యాక్షన్ మూవీలా కాకుండా, అంతర్జాతీయ టోన్‌తో కూడిన డార్క్ నారేటివ్‌గా మలిచినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కి మరింత ఇంపాక్ట్ ఇచ్చింది.
ఈ చిత్రంలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) వంటి స్టార్ నటీమణులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారాగణం, గ్లోబల్ టెక్నికల్ టీమ్‌తో ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ‘టాక్సిక్’ 2026 మార్చి 19న తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళంతో పాటు ఇంగ్లీష్‌లో కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే, యష్ మరోసారి ఇండియన్ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అభిమానులు మాత్రమే కాదు, ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నాయి.
