Homeక్రీడలుYash Dayal | ఇబ్బందుల్లో ఆర్సీబీ స్టార్ యశ్ దయాల్ కెరీర్​.. యూపీ టీ20 లీగ్‌...

Yash Dayal | ఇబ్బందుల్లో ఆర్సీబీ స్టార్ యశ్ దయాల్ కెరీర్​.. యూపీ టీ20 లీగ్‌ నుంచి ఔట్

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Yash Dayal : ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (Royal Challengers Bangalore) టైటిల్ తెచ్చిపెట్టేలా అద్భుత ప్రదర్శన చేసిన యశ్ దయాల్ ప్రస్తుతం తీవ్ర సమస్యల్లో చిక్కుకున్నాడు.

17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో.. యశ్‌ను ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) యూపీ టీ20 లీగ్ నుంచి తాత్కాలికంగా నిషేధించింది.

జైపూర్‌లోని సాంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో.. మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడంటూ యశ్ దయాల్‌పై కేసు నమోదైంది.

రాజస్థాన్ హైకోర్టులో అతనికి ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో, అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైనర్‌కు సంబంధించిన కేసు కావడంతో స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ ఆగస్టు 22న జరగనుంది.

Yash Dayal : చిక్కుల్లో ద‌యాల్..

గోరఖ్‌పూర్ లయన్స్ (Gorakhpur Lions) జట్టు యశ్ దయాల్‌ను Yash Dayal రూ. 7 లక్షలకు కొనుగోలు చేసినా.. ఈ నిర్ణయం వల్ల ఈ సీజన్‌లో అతను ఆడలేడు. ఇది అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది.

యశ్ దయాల్‌పై ఇది మొదటి లైంగిక ఆరోపణ కాదు. గతంలో ఘజియాబాద్‌కు చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో అతనికి అలహాబాద్ హైకోర్టు నుంచి స్టే లభించింది. కానీ తాజా కేసు మాత్రం అత‌ని మెడ‌కు చుట్టుకుంది. ఈ కేసు నుంచి బ‌య‌ట ప‌డ‌టం చాలా క‌ష్టంగా మారింది.

ఐపీఎల్ 2025లో య‌శ్ ద‌యాల్ 15 మ్యాచ్‌లలో 13 వికెట్లు తీసి ఆర్సీబీ టైటిల్ గెల‌వ‌డంతో కీలక పాత్ర పోషించాడు. తన ఆటతో అభిమానులను మెప్పించాడు.

కానీ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో ఈ ఆరోపణలు తన కెరీర్‌కు తీవ్ర ప్రమాదంగా మారాయి. గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న‌పై తీవ్ర ఆరోప‌ణలు వ‌స్తున్నా ఏ మాత్రం స్పందించ‌డం లేదు.

అయితే కోర్టు Court తీర్పు తేలే వరకు యశ్ దయాల్ క్రికెట్‌కు దూరంగా ఉండే అవకాశమే ఎక్కువ. ఒకవేళ ఆరోపణలు నిజమైతే, భారత క్రికెట్‌లో రాణిస్తున్న‌ ఒక యువ బౌలర్‌ కెరీర్ అర్ధంతరంగా ముగిసే ప్రమాదం ఉంది.