Homeతాజావార్తలుHarish Rao | యాసంగి బోనస్​ డబ్బులు విడుదల చేయాలి: హరీశ్​రావు

Harish Rao | యాసంగి బోనస్​ డబ్బులు విడుదల చేయాలి: హరీశ్​రావు

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు. యాసంగి సీజన్​కు సంబంధించిన బోనస్​ డబ్బులు చెల్లించాలన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీశ్​ రావు (Harish Rao) విమర్శించారు. ఆయన ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం (state government) 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పిందన్నారు. అయితే ఇప్పటి వరకు ఆరు లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందన్నారు. కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తూకం వేసిన ధాన్యానికి వెంట వెంటనే డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పినా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.1,400 కోట్లు రైతులకు (farmers) చెల్లించాల్సి ఉందన్నారు.

Harish Rao | బోనస్​ ఏమైంది

రాష్ట్రంలో సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్​ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత వానాకాలం సీజన్​లో (monsoon season) బోనస్​ డబ్బులు జమ చేశారు. అయితే యాసంగిలో సాగు చేసిన వారికి బోనస్​ ఇవ్వలేదు. ప్రస్తుతం వానాకాలం సీజన్​లో బోనస్​ చెల్లిస్తున్నారు. దీనిపై హరీశ్​రావు మాట్లాడుతూ.. గత యాసంగి సీజన్​కు (Yasangi season) సంబంధించిన బోనస్​ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు రూ.1200 కోట్ల బోనస్​ డబ్బులు రావాల్సి ఉందన్నారు.

Harish Rao | చలిలో ఇబ్బందులు

వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత (cold weather) పెరిగిందన్నారు. అయితే రైతులు చలిలో సైతం ధాన్యం కుప్పల వద్ద కాపలా కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాల్లో వెంటవెంటనే ధాన్యం తూకం వేయాలని డిమాండ్​ చేశారు.

Must Read
Related News