ePaper
More
    HomeజాతీయంYamini Sharma | బీజేపీ జాతీయ కౌన్సిల్​ మెంబర్​గా యామినిశర్మ

    Yamini Sharma | బీజేపీ జాతీయ కౌన్సిల్​ మెంబర్​గా యామినిశర్మ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yamini Sharma | బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామినిశర్శ (Sadineni Yamini Sharma) జాతీయ కౌన్సిల్​ సభ్యురాలిగా నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ కమల దళాధిపతిగా రాంచందర్​రావు(Ramchandra Rao), ఏపీకి అధ్యక్షుడిగా పీవీఎన్​ మాధవ్(AP President PVN Madhav)​ ఎన్నికయ్యారు. ఈ క్రమంలో జాతీయ కౌన్సిల్​ సభ్యులను కూడా బీజేపీ ప్రకటించింది. ఇందులో సాదినేని యామిని శర్మకు సైతం చోటు దక్కింది.

    యామిని శర్మ మాట్లాడుతూ.. మాధవ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పార్టీ కార్యకర్తలకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించిందన్నారు. పార్టీ తన సేవలను గుర్తించి, జాతీయ మండలి సభ్యురాలిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. కాగా ఆమెతో పాటు ఎంపీలు డి.పురందేశ్వరి, సీఎం రమేష్, ఎమ్మెల్యేలు పి.విష్ణు కుమార్ రాజు, పార్థసారథి, 20-పాయింట్ ప్రోగ్రామ్ ఛైర్మన్ లంకా దినకర్, జీవీఏ నరసింహారావు, విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు జాతీయ మండలి సభ్యులుగా నియమితులయ్యారు.

    Yamini Sharma | టీడీపీ నుంచి..

    యామినిశర్శ టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మంచి వాగ్దాటి కలిగిన ఆమె అంచెంలంచలుగా రాజకీయాల్లో ఎదిగారు. 2023లో టీడీపీకి రాజీనామా చేసిన ఆమె 2024లో కాషాయ గూటికి చేరారు. అనంతరం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఆమెను కేంద్ర నాయకత్వం తాజాగా జాతీయ కౌన్సిల్​ మెంబర్(National Council Member)​గా నియమించింది.

    Latest articles

    Crude Oil Imports | రష్యా నుంచి ఆయిల్​ కొంటాం.. స్పష్టం చేసిన ఆయిల్​ కంపెనీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Crude Oil Imports | రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు చేస్తూనే ఉంటామని...

    Education Department | విద్యాశాఖలో ముదిరిన వివాదం.. రెండు రోజులుగా హాజరు సంతకాలు పెట్టని ఉద్యోగులు!

    అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో (District Education Office) రోజురోజుకు వివాదం ముదురుతోంది....

    Mla Sudarshan reddy | ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి బర్త్​డే

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Mla Sudarshan reddy | ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్​ ప్రజాప్రతినిధులు...

    Kohli Hair Cut | విరాట్ కోహ్లీ హెయిర్ క‌ట్ ధ‌ర ఏకంగా రూ.ల‌క్ష‌కు పైనే.. ఆశ్చరపోతున్న ఫ్యాన్స్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kohli Hair Cut | ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ క్రికెట్ గ్రౌండ్‌లోనే కాదు...

    More like this