అక్షరటుడే, ధర్పల్లి : Dubbaka | తమ గ్రామానికి బస్సు రావడం లేదని రేకులపల్లి గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. ధర్పల్లి నుంచి భీమ్‌గల్ వెళ్లే దారిలో (Dharpalli Mandal) బుధవారం గ్రామస్థులు నిరసన చేపట్టారు.
గతంలో దుబ్బాక మీదుగా రేకులపల్లికి బస్సులు వచ్చేవని.. అయితే ఇటీవల వర్షాలకు గ్రామ సమీపంలోని వంతెన శిథిలమైందన్నారు. ఈ నెపంతో బస్సులు దుబ్బాక (Dubbaka)కు వచ్చి అక్కడి నుంచి రేకులపల్లికి రాకుండా.. దుబ్బాక మీదుగా మైలారం కోరట్‌పల్లి, చల్లగరిగె, సుద్దులం యానంపల్లి, డిచ్పల్లి, నిజామాబాద్‌కు వెళ్తున్నాయన్నారు. తమ గ్రామం వరకు బస్సు రాకపోవడంతో ఉదయాన్నే వివిధ పనులు నిమిత్తం వెళ్లేవారికి.. ముఖ్యంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు పేర్కొన్నారు.
వెంటనే బస్సు సర్వీసు (Bus Service)ను రేకులపల్లి గ్రామం వరకు పొడిగించాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ధర్పల్లి పోలీసులు (Dharpalli Police) సంఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్థులను సముదాయించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.