Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | రికార్డుల నిర్వహణలో రైటర్లు నైపుణ్యం సాధించాలి: సీపీ సాయిచైతన్య

Nizamabad CP | రికార్డుల నిర్వహణలో రైటర్లు నైపుణ్యం సాధించాలి: సీపీ సాయిచైతన్య

పోలీస్​స్టేషన్లలో రికార్డు రైటర్స్​ పూర్తి పరిజ్ఞానం సాధించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. సీపీ కార్యాలయంలోని రైటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad CP | పోలీస్​స్టేషన్లలో రైటర్లు రికార్డుల నిర్వహణలో నైపుణ్యం సాధించాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. పోలీస్​స్టేషన్లలో (police stations) నూతనంగా నియమితులైన రైటర్స్​కు సీపీ కార్యాలయంలో వారం రోజుల శిక్షణ కార్యక్రమం చేపట్టారు. దీనిని సీపీ మంగళవారం ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రికార్డుల నిర్వహణలో నైపుణ్యం పెంపొందించడం, పారదర్శకత, సమయపాలన అనేది పోలీసు వ్యవస్థ (police system) బలోపేతానికి ముఖ్యమైన అంశాలని పేర్కొన్నారు. శిక్షణలో పోలీస్​స్టేషన్ రైటర్స్‌కు కేసు దర్యాప్తు పత్రాలు, ఎఫ్‌ఐఆర్ రిజిస్ట్రేషన్ (FIR registration), సైబర్ క్రైం రికార్డింగ్ (cyber crime recording), రిపోర్టింగ్, ఆధునిక పోలీస్ డాక్యుమెంటేషన్ పద్ధతులపై, మార్గదర్శకాలు అందిస్తామని స్పష్టం చేశారు.

శిక్షణ పూర్తయిన తర్వాత సిబ్బంది తమ పోలీస్​స్టేషన్లకు వెళ్లి తమ ఉన్నతాధికారులకు శిక్షణ వివరాలు అందజేయాలని సూచించారు. పోలీస్​స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తించాలనే విషయంపై తెలియజేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, పోలీసు శిక్షణ కేంద్రం ఏసీపీ రాజశేఖర్​, సీఐ శివరాం తదితరులు పాల్గొన్నారు.