ePaper
More
    HomeతెలంగాణKCR | రాసిపెట్టుకోండి.. మళ్లీ వచ్చేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమే: కేసీఆర్

    KCR | రాసిపెట్టుకోండి.. మళ్లీ వచ్చేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమే: కేసీఆర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR | మళ్లీ వచ్చేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమే అని కేసీఆర్​ Kcr అన్నారు. వరంగల్ సభలో warangal Brs Sabha ఆయన మాట్లాడుతూ.. పోలీసులను హెచ్చరించారు. కాంగ్రెస్​ చెప్పినట్లు తమ కార్యకర్తలపై కేసులు పెట్టడం, ప్రస్తుతం సభను అడ్డుకోవడానికి పోలీసులు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తున్న పోలీసులు telangana police తమ డైరీలో రాసుకోవాలని.. వచ్చేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు వారి లెక్క తేలుస్తామన్నారు.

    కాంగ్రెస్​ నాయకులు నిత్యం బీఆర్​ఎస్​ మీద నిందలు వేయడం తప్ప చేసిందేమి లేదన్నారు. నాడు వైఎస్​ హయాంలో ఆరోగ్య శ్రీ పథకం arogya shree scheme తెస్తే అది బాగుండటంతో దానిని తమ ప్రభుత్వ హయాంలో అలాగే కొనసాగించామన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం మాత్రం కేసీఆర్​ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తోందన్నారు. ప్రస్తుతం రజతోత్సవ సభ పెట్టుకుంటే అనేక అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు.

    KCR | కమీషన్ల ప్రభుత్వం..

    ప్రస్తుతం రాష్ట్రంలో కమీషన్ల ప్రభుత్వం నడుస్తోందని కేసీఆర్​ ఆరోపించారు. 20 శాతం కమీషన్లు ఇస్తే కానీ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. కమీషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్​ ఎదుట ధర్నా చేశారని గుర్తు చేశారు. ప్రజల వెంట బీఆర్​ఎస్​ ఉంటుందన్నారు.

    KCR | ఆపరేషన్​ కగార్​ ఆపేయండి

    కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది శూన్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్​ కగార్​ పేరుతో మావోయిస్టులను ఎన్​కౌంటర్​ చేస్తోందన్నారు. ఎంతో మంది అమాయక గిరిజనులను చంపేస్తోందన్నారు. నక్సలైట్లు చర్చలకు సిద్ధమని ప్రకటించారని, వారితో మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు. వెంటనే ఎన్​కౌంటర్లు ఆపాలని కోరారు. ఈ మేరకు కేంద్రానికి బీఆర్​ఎస్​ తరఫున లేఖ రాస్తామన్నారు.

    KCR | ప్రభుత్వాన్ని పడగొట్టం

    తాము ప్రభుత్వాన్ని పడగొట్టమని మాజీ సీఎం కేసీఆర్​ అన్నారు. ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్​ వీపు పగులకొడతారన్నారు. తమకు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం లేదన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...