అక్షరటుడే, వెబ్‌డెస్క్: WPL 2026 | మహిళల క్రికెట్‌కు మరింత వన్నె తీసుకొస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ 2026 నాలుగో సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు సాగనున్న ఈ టోర్నమెంట్‌లో ఐదు జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి.
ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 5న జరగనుంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants), యూపీ వారియర్స్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. గతేడాది నవంబర్ 27న జరిగిన మెగా వేలంతో జట్ల రూపురేఖలు గణనీయంగా మారాయి. కొత్త కాంబినేషన్లు, కొత్త స్ట్రాటజీలతో ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారనుంది.
WPL 2026 | తొలి మ్యాచ్ ఎవరి మధ్య?
WPL 2026 తొలి పోరు ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఇప్పటికే 2023, 2025 సీజన్లలో ట్రోఫీని ఎత్తుకుని రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. మరోవైపు, 2024 సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ కూడా ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగుతోంది. అందుకే తొలి మ్యాచ్ నుంచే హై వోల్టేజ్ ఫైట్‌ను అభిమానులు ఆశిస్తున్నారు.
WPL 2026 | లైవ్ ఎక్కడ చూడాలి?
WPL 2026 మ్యాచ్‌లను టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డిజిటల్ వీక్షకులు Jio Hotstar యాప్ మరియు వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు. భారత కాలమానం ప్రకారం అన్ని మ్యాచ్‌లు సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
WPL 2026 | టోర్నమెంట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది?
ఈ సీజన్ డబుల్ రౌండ్-రాబిన్ విధానంలో నిర్వహించనున్నారు. అంటే ప్రతి జట్టు మిగతా జట్లతో రెండుసార్లు తలపడుతుంది. లీగ్ దశలో ప్రతి జట్టు Team మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడుతుంది.
పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.
రెండో, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించి, ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడతాయి.
ఎలిమినేటర్ విజేత ఫైనల్‌లో టేబుల్ టాపర్‌తో టైటిల్ కోసం పోరాడుతుంది.
మొత్తానికి, కొత్త జట్ల కాంబినేషన్లు, స్టార్స్ మధ్య పోటీ, టైటిల్ రేస్ అన్ని కలిపి WPL 2026 మహిళల క్రికెట్ అభిమానులకు పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది. తొలి బంతి నుంచే హోరాహోరీగా మ్యాచ్‌లు సాగనున్నాయనే అంచనాలు నెలకొన్నాయి.